HomeTelanganaNizamabad70వ ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ...

70వ ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు

హైదరాబాద్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) అంతర్ పాఠశాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు–2026–27 మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ ప్రారంభ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయవచ్చని అన్నారు.

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన ఆకాంక్షించారు.అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలురు, బాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గుర్తించి, తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయడం ద్వారా వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.పాల్గొన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ SAtG చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments