ఢిల్లీ లిక్కర్ కేసులో శుక్రవారం అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయమే వైద్య పరీక్షలు నిర్వహించారు .అనంతరం ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లారు. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు ఈడీ అధికారులు.మరో వైపు , తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.