సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ లు కాసేపట్లో రాబోతుంది . ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. నాలుగు లేదా అయిదు దఫాల్లో పోలింగ్ పక్రియ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లో జరిగే ఛాన్స్ ఉంది.
లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను సైతం ప్రకటిస్తారు.ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. ఆలోపు సార్వత్రిక ఎన్నికల పక్రియ ను పూర్తీ చేయాలి.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి అందుకే .ఆరాష్ట్రాల్లో లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరపనున్నారు గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి..