HomeCRIMEకవిత రిమాండ్ పొడగింపు …..ఈనెల 23 దాక తీహార్ జైలు లోనే

కవిత రిమాండ్ పొడగింపు …..ఈనెల 23 దాక తీహార్ జైలు లోనే

లిక్కర్ కేసులో నిందితురాలు కవితకు ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.

మళ్లీ కవితను తీహార్‌ జైలుకు ఈడీ అధికారులు తరలించారు . 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను మంగళవారం కవితను ఈడీ అధికారులు కోర్టు లో హాజరుపర్చిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోరింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది .మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, మార్చి 16న ఆమెను కోర్టు ముందు హాజరు పర్చారు.

మార్చి  23 వరకు కవితకు ఈడీ కస్టడీ, అనంతరం మరో మూడు రోజులు కవితకు ఈడి కస్టడీని కోర్టు పొడిగించింది. 26వ తేదీన కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments