మార్గదర్శి ఫై విచారణ నిలిపివేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీనితో మార్గదర్శి డిపాజిట్ సేకరణఫై 17 సాగుతున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది.
మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం న్యాయ వాది ఉండవల్లి అరుణ్ కుమార్ లు వేసిన అప్పీల్ పిటిషన్ lలను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది.
‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి.రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణలో ఈ పక్రియ సాగాలని పేర్కొంది.తదుపరి విచారణ తెలంగాణ హైకోర్టు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆరు మాసాల్లో కేసు విచారణ పూర్తీ చేయాలనీ పేర్కొంది.