HomePOLITICAL NEWSUncategorizedకేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ, కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ_–కేసీఆర్ బాటలోనే అడుగు, తెలంగాణ ద్రోహుల...

కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ, కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ_–కేసీఆర్ బాటలోనే అడుగు, తెలంగాణ ద్రోహుల గుండెల్లో పిడుగు –కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే ఆయన తనయుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో గురువారం జీవన్ రెడ్డి ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు.రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలన్న సంకల్పం కేటీఆర్ లో మరింత పెరగాలని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

భగవంతుడి దీవెనలతో కేటీఆర్ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సంపూర్ణ‌ ఆరోగ్యంతో ఉండాలని జీవన్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ సూర్యుడు కేసీఆర్ బాటలోనే కేటీఆర్ అడుగులు వేస్తూ, తెలంగాణ ద్రోహుల గుండెల్లో పిడుగులు కురిపిస్తున్నారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న కేటీఆర్ సర్కారుకు కొరకరాని కొయ్యగా మారారనే అక్కడితోనే ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments