ఓ పక్క ప్రభుత్వం రైతులకు ఎక్కడ యూరియా కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికిని క్షేత్రస్థాయిలో అది కనబడడం లేదు.
యూరియా కోసం ఒక్కసారి రైతులు ఎగబడడంతో వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ సహకార సంఘం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పచ్చల నడుకుడ సహకార సంఘం పరిధిలో ఉన్న రైతులు యూరియా కోసం పడిగాపులు కాచే పరిస్థితి ఎదురైంది.
ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు వరి, మొక్కజొన్న పంటలను ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో సాగు చేయడంతో… యూరియా అవసరం ఎక్కువైంది.
దీంతో రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లో పాసుబుక్కులు , రాళ్లను పెట్టి నిరీక్షించారు. అనంతరం రైతులంతా ఒక్కటై..
ఒక్కొక్కరు రెండేసి బస్తాల చొప్పున తీసుకోవడానికి ఒప్పుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను అధికారులు సరఫరా చేయాలని కోరుతున్నారు.
