HomeTelanganaNizamabadవీసీ నియామకలో పావులు కదుపుతున్న నేతలు ……..తెలంగాణ యూనివర్సిటీలో ఆధిపత్యం కోసం అధికార పార్టీ వ్యూహ...

వీసీ నియామకలో పావులు కదుపుతున్న నేతలు ……..తెలంగాణ యూనివర్సిటీలో ఆధిపత్యం కోసం అధికార పార్టీ వ్యూహ రచన

నేతల యూనివర్సిటీల్లో పాలక మండలిల నియామకాల మీద రేవంత్ సర్కార్ కసరత్తులు వేగవంతం చేసింది.ఈ నియామకాల్లో తమదైన ముద్ర కోసం అధికారపార్టీ తహ తహా లాడుతుంది. గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ యస్ పాలక మండలిల నియామకాల్లో ఇదే విధానం అనుసరించింది.

యూనివర్సిటీలకు కొత్త వీసీ ల నియామకాల కోసం ఈపాటికే సెర్చ్ కమిటీ లు వేసింది. మొదట వీసీ ల నియామకం తరవాతే ఈసీ సభ్యులను నియమించే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. అక్రమాలు అవినీతి వరస వివాదాలతో అట్టుడుకిన తెలంగాణ వర్సిటీ వీసీ విషయంలో తీవ్రమైన పోటీ ఉంది.వీసీ పోస్టు కోసం ప్రభుత్వం ఈపాటికే దరఖాస్తులను స్వీకరించింది. తమకున్న అర్హతల మేరకు 133 మంది వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో ఆరుగురు వర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ఉన్నారు.కానీ ఇందులో అధికార పార్టీ కీలక నేతల సిఫారస్ లున్న అభ్యర్థులు అరడజన్ మంది ఉన్నారు.ఓ దరకాస్తు దారుడు ఏకంగా కర్నటక కాంగ్రెస్ నేత ను రంగంలోకి దించాడని ప్రచారం జరుగుతుంది. నిజానికి వీసీ నియామకం పక్రియ విధానం మరోలా ఉంది దరఖాస్తుల జాబితా ఆధారంగా ముగ్గురి పేర్లను గవర్నర్​కు రికమెండ్ చేసే బాధ్యత సెర్చ్ కమిటీకి సర్కారు అప్పగించింది.

టీయూ వర్సిటీ తరఫున ప్రొఫెసర్​సులేమాన్​ సిద్దిఖీ, యూజీసీ తరఫున రాజేశ్వర్​సింగ్​ ఛండేల్, గవర్నమెంట్​పక్షాన ఛీప్​ సెక్రటరి శాంతికుమారి ఉన్నారు. ఈ కమిటీ సిఫారసు చేసే ముగ్గురిలో ఒకరిని గవర్నర్​అపాయింట్​ చేస్తారు. కానీ సెర్చ్ కమిటీ ఎవరి పేర్లను సిఫారస్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. అనేక వివాదాల నేపథ్యం ఉన్నవారే ఈసారి వీసీ రేసులోకి దూసుకొచ్చారనే చర్చ విసృతంగా సాగుతుంది.

మరో వైపు కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి యునివర్సిటీ తన సెగ్మెంట్ పరిధి లో ఉన్న నేపథ్యంలో వీసీ నియామకం లో తన మాట చెల్లుబాటు అయ్యేలా చక్రం తిప్పుతున్నారు. మరో వైపు ఓ ఎమ్మెల్సీ సైతం వీసీ విషయంలో తన సిఫారస్ చేసుకోవడానికి సీఎం స్థాయిలో పావులు కదుపుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments