సమీర్ అనే యువకుడికి తీవ్ర గాయాలు
ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
జానా రమేష్ :ఇది సంగతి; ఆర్మూర్ ;ఆర్మూర్ పట్టణంలో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్మూర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు మరిన్ని వివరాలలోకి వెళితే… మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కు చెందిన సమీర్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి తన కారును అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది.
ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త వాహనానికి అద్దెకు తీసుకున్న మరో వ్యక్తి ప్రమాదానికి గురి చేయడంతో దాని విషయమై మాట్లాడదామని పిలిపించిన సదరు కిరాయిదారు సమీర్ పై ఏకంగా కర్రలతో, రాళ్లతో దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు .
సంఘటన స్థలానికి ఆర్మూర్ పోలీసులు చేరుకొని అక్కడే చిందరవందరగా పడి ఉన్న ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీర్ నుచికిత్స కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



