కమ్మర్ పల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి చనిపోయిందని పోలీసులు చెప్పారు. ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ సమీపంలో చిరుత మృతదేహం ఉన్నట్లు పశువుల కాపరి కమ్మర్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారంతా వెళ్లి చిరుత మృతదేహం ను పరిశీలించారు చిరుత పులి రెండు రోజుల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా రిజర్వ్ అటవీ ప్రాంతంలోలోని చెరువు వద్ద రెండు కూనలతో సంచరించినట్లుగా స్థానికులు చెపుతున్నారు. చిరుతు ఎలా మృతి చెందింది అనేది ఇంకా నిర్దారించలేక పోతున్నారు