విద్యార్థులను ఇబ్బందులకు గురించేస్తున్న MJP ప్రిన్సిపాల్ సంగీత ను వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు
MJP లోని విద్యార్థులు ప్రిన్సిపాల్ పెట్టె ఇబ్బందులు భరించలేక గోడ దూకి పోలీస్ స్టేషన్ లో వారి సమస్యలను వివరించుకున్నారు ఆదిలాబాద్ లోని స్తానిక మావాల మహాత్మ జ్యోతి బాపులే పాఠశాల మరియు కళాశాల జైనాథ్( బాలురు) ఇటీవల విద్యారంగ సమస్యల పరిష్కారంలో భాగంగా పాఠశాలను సందర్శించడం జరిగిందని
తరచూ ప్రిన్సిపాల్ అక్కడ సిబ్బంది ఏబీవీపీ విద్యార్థి నాయకులకు సమస్యలు చెప్పిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారిని మానసికంగా హింసిస్తూ ప్రిన్సిపాల్ సంగీత పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. విద్యార్థులకూ టీసీలు ఇస్తాను బెదిరిస్తూ విద్యార్థులను చెప్పులతో కొడతా అనే సంభాషణ చేయడం ప్రిన్సిపల్స్ స్థాయికి తగున అన్నారు
హాస్టల్ సందర్శించినప్పుడు ఏబీవీపీ నాయకులు చిల్లరగాళ్లు చదువులు లేనోళ్లు అని సంభాషించడం ఆమె సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఇకపై ఏబీవిపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆమె సమాజంలో తిరిగే పరిస్థితి ఉండదన్నారు .
ఆమె మానసిక పరిస్థితిపై రిమ్స్ లో డైరెక్టరర్ ఫిర్యాదు చేయాలన్నట్లు పేర్కొన్నారు. సంగీత ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసేవరకు ఏబీవీపీ ఊరుకునే ప్రసక్తే లేదని. ఈ విషయంపై విద్యాశాఖ కమిషనర్ బుర్ర వెంకటేశం. మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
విద్యారులను ఇబ్బందులకు గురించేస్తున్న ప్రిన్సిపాల్ సంగీతను వెంటనే సస్పెండ్ చేయాలనీ ఏబీవీపీ ఇందూర్ విభాగ్ డిమాండ్చేశారు జిల్లా కన్వినర్ దామ సునీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గాదాస్ , బాలు, గణేష్, పింటూ, రాజేష్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు