జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి- ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి- అందాపూర్ ,మగ్గిడి,ఖానాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం- పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ,ప్రజలుకాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని చేతు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ మండలం అందాపూర్ ,మగ్గిడి,ఖానాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో ప్రొద్దుటూరు వినకుమారెడ్డి మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంబించిందని, అందపూర్,మగ్గిడి, ఖానాపూర్ గ్రామంలో ఇప్పటివరకు నాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు తప్ప ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు పథకాలను వివరిస్తూ… నాలుగు పథకాలను అమలు చేయడం జరిగిందని, మరో రెండు పథకాలు పార్లమెంటు ఎన్నికలు పూర్తికాగానే అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను ఉన్నానని భరోసా కల్పించారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నిజామాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి ,మాజి నిజాంసాగర్ కెనాల్ ఛైర్మెన్ యల్లా సాయిరెడ్డి, ఆర్మూర్ మండల ఎంపిపి పస్కా నర్సయ్య , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సాపల్లి జీవన్ ,ఆర్మూర్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి,దెగాం ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్,అంకపూర్ ఎంపిటిసి MC గంగారెడ్డి ,మగ్గిది మాజి సర్పంచ్ నర్సయ్య,మాజి సర్పంచ్ లక్ష్మీ నారాయణ గౌడ్ , మాజి ఎంపిటిసి సభ్యులు జెన్నపల్లి గంగాధర్ ,మగ్గిది దేవా రెడ్డి లతో పాటు పలువురు పాల్గొన్నారు.


