వర్ని మండల కేంద్రంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఓ ఇంటి పై పిడుగు పడింది. మండల కేంద్రంలోని నివాసం ఉంటున్న శివకుమార్ ఇంటి పైన పిల్లర్ పై పిడుగు పడింది. దీంతో పిల్లర్ పూర్తిగా ధ్వంసమైంది.
ఇంట్లోని విద్యుత్ మీటర్ కాలిపోగా ఇతర విద్యుత్తు ఉపకరణాలు చెడిపోయాయి. చుట్టుపక్కల నాలుగు ఇళ్లలో కూడా విద్యుత్ ఉపకరణాలు చెడిపోయినట్లు స్థానికులు తెలిపారు
