HomeLaw and Orderహోలీ వేళ మద్యం దుకాణాలు బంద్..

హోలీ వేళ మద్యం దుకాణాలు బంద్..

హోలీ పండుగ, కామదహనం వేడుకల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968, సెక్షన్ 20(1) ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

మార్చి 3వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 5వ తేదీ (గురువారం) ఉదయం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా ఉన్న కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ (A4) షాపులు, 2-బి బార్లు, క్లబ్బులు, టీడీ-1 మరియు సీఎస్-2 మద్యం విక్రయ కేంద్రాలు పూర్తిగా మూసివేయాలన్నారు.

పండుగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలని సీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments