Monday, April 27, 2026
HomeCRIMEనిజామాబాద్ అదనపు డీసీపీగా శుభం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ..

నిజామాబాద్ అదనపు డీసీపీగా శుభం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ..

నిజామాబాద్ అదనపు డీసీపీ గా శుభం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన బస్వారెడ్డిని పోలీస్ ప్రధాన కార్యాలయానికి (చీఫ్ ఆఫీస్) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, ఆయన స్థానంలో శుభం ప్రకాష్ నియమితులయ్యారు.

2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుభం ప్రకాష్ గతంలో కరీంనగర్ రూరల్ ఏసీపీగా సేవలందించారు. శిక్షణ కాలం నుంచే విభిన్న ప్రాంతాల్లో పనిచేసి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో నిజామాబాద్ చేరుకున్న ఆయన, నిన్న సాయంత్రం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శుభం ప్రకాష్‌ జిల్లా పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి. అలాగే కలిసి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!