నిజామాబాద్, మే 13 : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ ముగిసే సమయానికి సగటున 71.47 శాతం ఓటింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
తుదిగా ఖరారయ్యే పోలింగ్ జాబితాలో స్వల్ప మార్పులు చేర్పులు జరిగేందుకు కూడా ఆస్కారం ఉండవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం 7.00 గంటలకు పార్లమెంటు సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ పలు చోట్ల రాత్రి వరకు కొనసాగిందన్నారు.
పోలింగ్ ముగిసే నాటికి సగటున 71.47 శాతం ఓటింగ్ నమోదయ్యిందని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ ముగిసిన మీదట కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎం లను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం జరుగుతోందని తెలిపారు.——-