లారీ, డీసీఎం వాహనాలు ఢీకొన్న ఘటనలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన క్లీనర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
