Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadయువతకు ఉపాధి దిశగా శిక్షణ ఉండాలి: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్..

యువతకు ఉపాధి దిశగా శిక్షణ ఉండాలి: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్..

నిర్మాణ రంగంలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

గురువారం ఆయన నిజామాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అకాడమీలో అందుతున్న వివిధ కోర్సులు, శిక్షణా విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణులకు భారీ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్‌మెంట్స్ కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, నైపుణ్యాభివృద్ధి ద్వారా సొంత కాళ్లపై నిలబడాలి. దానికి ‘న్యాక్’ వంటి సంస్థలు మార్గదర్శకంగా ఉంచాలని సూచించారు.

ఈ సందర్శనలో ఆయన వెంట డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి,బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాంభూపాల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!