HomeLaw and Order7న జరిగే ఆటోబందును జయప్రదం చేయండి

7న జరిగే ఆటోబందును జయప్రదం చేయండి

7న జరిగే ఆటోబందును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాల నాయకులతో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ..

ఆటో కార్మికులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే మోటార్ వెహికల్ చట్టంలో సవరణ ఉపసంహరించుకోవాలని, ఆటో పార్కింగ్ స్థలాలకు అద్దాలను కేటాయించాలని తదితర డిమాండ్లతో నిర్వహించే బంధును కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. హనుమాన్లు, నగర అధ్యక్షులు బి శ్రీనివాస్, కార్యదర్శి జబ్బార్, వర్కింగ్ ప్రెసిడెంట్ షాదుల్, ఉపాధ్యక్షులు రఫీ ఖాన్, నాయకులు మతి న్, జావీద్ ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments