HomeCRIMEజశ్వంత్ రెడ్డి మృతి ఫై - సీఐడీ విచారణకు డిమాండ్-టీజీవీపీ.

జశ్వంత్ రెడ్డి మృతి ఫై – సీఐడీ విచారణకు డిమాండ్-టీజీవీపీ.

కాకతీయ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి జశ్వంత్ రెడ్డి అనుమానాస్పద మృతి ఫై సీఐడీ విచారణ జరిపించాలని తెలంగాణ విద్యార్థి పరిషద్ డిమాండ్ చేసింది ఈ మేరకు అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో లో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం అందజేసారు .

ఈ ఘటనపై స్పష్టత రానప్పటికీ, పాఠశాల యాజమాన్యం బాధిత కుటుంబాన్ని మౌనంగా ఉండమని బెదిరిస్తుందనే ఉన్నారు జశ్వంత్ రెడ్డి మరణానికి సంబంధించి పూర్తి నిజాలను వెలికితీయడానికి (సీఐడీ )ద్వారా నిష్పక్షపాత విచారణ జరపాలిబాధిత కుటుంబానికి తక్షణ భద్రత కల్పించి, వారిని బెదిరింపుల నుండి రక్షించాలి పాఠశాల యాజమాన్యం పాత్రపై

ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం బాధ్యతను విచారణ చేసి, నిర్లక్ష్యం లేదా తప్పు జరిగిందని నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలి.ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం తీరుతో విద్యార్థుల భవిష్యత్‌పై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

అందుకే, బాధిత కుటుంబానికి న్యాయం జరుగడం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమం నగర అధ్యక్షులు అఖిల్ సుజిత్ ,మనోహర్, రియాన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments