HomeCRIMEప్రారంభానికి ముస్తాబవుతున్న మాక్లూర్ ఠాణా..

ప్రారంభానికి ముస్తాబవుతున్న మాక్లూర్ ఠాణా..

సరికొత్త హంగులాలతో మాక్లూర్ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముస్తాబవుతుంది. నిత్యం సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించే మాక్లూర్ పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరింది.

ఈ మేరకు గత ప్రభుత్యం మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ లో 63 జాతీయ రహదారి పక్కన భూమి పూజా చేసి ప్రారంభించారు.

ఈ నూతన పోలీస్ స్టేషన్ కు ప్రభుత్యం రూ 80 లక్షల నిధులు మంజూరు చేశారు. మొదట నూతన భవన నిర్మాణానికి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించి నిధులు విడుదల ఆలస్యం కావడంతో పనుల్లో జాప్యం చేస్తూ చేతులెత్తేశారు.

చేసేదేమీ లేక పోలీసులు మరో కాంట్రాక్టర్ కు అప్పగించడంతో పనులు ప్రారంభించారు. దీంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగవంతం చేసి నూతన హంగులతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఎట్టకేలకు పదేళ్ల తర్వాత నూతన పోలీస్ స్టేషన్ కు శ్రీకారం చుట్టారు.నూతన పోలీస్ స్టేషన్ ను ఈ నెలాఖరులో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

అలాగే నూతన పోలీస్ స్టేషన్ లో ప్రజల సౌకర్యం కోసం రిసెప్షన్ సెంటర్ తో పాటు సీసీ ఫుటేజ్ చూడటానికి,అధికారుల సమావేశాలు,సముదాయము,అన్నిరకాల సౌకర్యాలతో ప్రత్యేకంగా నిర్మాణం చేశారు. నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని చూడగానే ప్రజలు ఆకర్షించే విధంగా ముస్తాబుచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments