కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుపన్ పల్లి కి చెందిన దుడ్డు లింగన్న గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో ఆదివారం మృతి చెందారు.
ఈ మేరకు ఆయన అంతక్రియల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని పాడి మోసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దుడ్డు లింగన్న (గుపన్ పల్లి ) మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుచరుడు గా ముద్ర వేసుకొన్నారు ‘ గతంలో ఎంపీటీసీ గా పోటీ చేసి ఓడిపోయారు.
గత నిజామాబాదు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో గుపన్ పల్లి నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి నమ్మిన వ్వక్తి గా తన ముద్ర వేసుకొన్నారు.
