మట్కా ఆడుతూ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఆర్మూర్ పరిధిలో చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలూరు గ్రామంలో ఓ వ్యక్తి మట్కా ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచార మేరకు దాడి నిర్వహించి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అతని వద్ద నుంచి 1300 రూపాయలు స్వాధీనం పరుచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.
