ఈ ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని అర్సపల్లీ కి చెందిన తరికంటి యాదయ్య (75).వృత్తి వ్యవసాయం చేస్తారు.
పనులు నిమిత్తం వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అటు వైపుగా అజాగ్రత్త వస్తున్న ఓ లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
