HomeCRIMEచికిత్స పొందుతూ వ్యక్తి మృతి…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన యూసఫ్ తన స్నేహితుడు అవినాష్ లు కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కంటేశ్వర్ ఉమెన్స్ కాలేజీ వద్ద వాహనం అదుపు తప్పి కింద పడ్డారు.దీంతో యూసఫ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments