HomeCRIMEబైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం

బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం

నిజామాబాద్ నగరంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ప్రధాన నిందితుడిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

గురువారం నాడు టౌన్-1 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం…కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండలం శివపురం గ్రామానికి చెందిన వధేరా నవీన్ (22, వృత్తి: మేస్త్రి పని) ప్రస్తుతం నిజామాబాద్‌లోని నాందేడ్ వాడ (అముల్ బేకరి వద్ద) నివసిస్తున్నాడు.

జల్సాలకు అలవాటు పడిన ఇతడు బైక్‌లను దొంగిలించడమే వృత్తిగా మార్చుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రోడ్‌లోని కవిత కాంప్లెక్స్ ముందు పార్కింగ్ చేసి ఉన్న గ్లామర్ బైక్‌ను (TS 16 EN 6948) నకిలీ తాళం (ఫాల్స్ కీ) సహాయంతో దొంగిలించాడు.

సదరు బైక్‌పై నవీన్ బాన్స్ వాడ వైపు వెళ్తుండగా, రైల్వే బ్రిడ్జి వద్ద టౌన్-1 పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించిన నవీన్‌ను సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు.

పోలీస్ శైలిలో విచారించగా నిజామాబాద్, ఎల్లారెడ్డి, బాన్స్ వాడ, పిట్లం పోలీస్ స్టేషన్ల పరిధిలో చేసిన పలు దొంగతనాల వివరాలను అతడు అంగీకరించాడు.నిందితుడు నవీన్ దొంగిలించిన బైక్‌లను కామారెడ్డి జిల్లా సోమేశ్వర గ్రామానికి చెందిన మహమ్మద్ మోయిజ్ (ఏ -2), అలకుంట మోహన్ (ఏ-3)లు అవి దొంగతనం సొత్తు అని తెలిసినప్పటికీ తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న బైక్‌ల వివరాలు: 1.పల్సర్ బైక్ (TS 17 J 9116) – టౌన్-1 పీఎస్, నిజామాబాద్, 2. గ్లామర్ బైక్ (TS 16 EN 6948) – టౌన్-1 పీఎస్, నిజామాబాద్, 3. గ్లామర్ బైక్ (AP 23 AE 2507) – ఎల్లారెడ్డి పీఎస్, 4. గ్లామర్ బైక్ (TS 17 C 9223) – బాన్స్ వాడ పీఎస్, 5. హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ – పిట్లం , 6. మరో చోరీ యత్నం కేసు (టౌన్-1 పీఎస్) మొత్తం 6 బైక్‌లను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడు వధేరా నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ బి. రఘుపతి వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments