పాత రైస్‌మిల్లులో చొరబడి మోటార్ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరానికి చెందిన విఠల్‌గౌడ్‌కు ఖానాపూర్ పరిధిలో ఒక పాత రైస్‌మిల్లు ఉంది. కాగా, బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఖానాపూర్ గ్రామానికి చెందిన పసుపుల మహిపాల్ (33) అనే వ్యక్తి సదరు మిల్లు డోర్ బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించాడు.
మిల్లులో ఉన్న 10 హెచ్‌పీ మోటార్‌ను దొంగిలించి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకుని, యజమాని విఠల్‌గౌడ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని చోరీకి గురైన మోటార్ తనదేనని నిర్ధారించుకున్నారు.
అనంతరం రాత్రి 8 గంటల సమయంలో విఠల్‌గౌడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తుండగా.. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఖానాపూర్ చౌరస్తాలో రోడ్డు పక్కన మద్యం మత్తులో పడి ఉన్న మహిపాల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో గురువారం నిందితుడిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
