HomeCRIMEపోలీస్ స్టేషన్ ముందు న్యూసెన్స్ చేసిన వ్యక్తికి 14 రోజులు రిమాండ్...

పోలీస్ స్టేషన్ ముందు న్యూసెన్స్ చేసిన వ్యక్తికి 14 రోజులు రిమాండ్…

పోలీస్ స్టేషన్ ముందు న్యూసెన్స్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కు తరలించినట్లు రెండవ టౌన్ ఎస్ఐ అరాఫత్ పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం పట్టణంలోని బురుడుగల్లి చెందిన జంబిలం దిలీప్ ఎలాంటి పని లేకుండా జలసాలకు అలవాటు పడి తన తల్లిని డబ్బులు ఇవ్వమని కొడుతున్నాడని లేకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని 100 నంబరుకి కాల్ చేయగా పోలీస్ సిబ్బంది వెళ్ళారు.

వెళ్లి తల్లి ని ఎందుకు కొడుతున్నావని అడిగినందుకు కాలనీవాసులను బూతులు తిడుతూ ఇబ్బందుల గురి చేస్తునడని అతన్ని భయపడి అతని తల్లి పోలీస్ స్టేషన్ కి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. జంబిలం దిలీప్ ఇంట్లో కూరగాయలు కోసే కత్తిని తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని తల్లిని బెదిరించినట్లు తెలిపారు.

డబ్బులు ఇవ్వమని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తన తల్లి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తను తెచ్చుకున్న కత్తితో మెడపై, ఛాతీ పైన కలోసుకున్నట్లు తెలిపారు.

ఇది గమనించి పోలీస్ వాహనంలో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి నిజామాబాద్ కి తరలించి అక్కడ చికిత్స చేయిస్తుండగా ప్రభుత్వ ఆస్పత్రి లో కూడా డాక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించి న్యూసెన్స్ చేసినట్లు తెలిపారు. శనివారం అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టు వారి ముందు ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments