HomeTelanganaNizamabadనామినేటెడ్ పందేరం ముగిసినట్లేనా .....ఇక స్థానిక సమరం మీద ఆశలు .....పార్టీ శ్రేణుల్లో తొలగని నిరాశ...

నామినేటెడ్ పందేరం ముగిసినట్లేనా …..ఇక స్థానిక సమరం మీద ఆశలు …..పార్టీ శ్రేణుల్లో తొలగని నిరాశ …….అరా తీస్తున్న పీసీసీ

పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరవాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఏడాది పాలన పూర్తీ చేసుకుంది. వారం రోజుల పాటు ప్రజా పాలన పేరుతొ ఉత్సవాలు చేసి సంబర పడింది.

కానీ క్యాడర్ లో మాత్రం ఆ జోష్ మచ్చుకైనా కనిపించడం లేదు.ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి బలంగా ఉందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. నామినేటెడ్ పదవుల పంపకాలు సైతం పార్టీ నేతల్లో ఇలాంటి వైఖరి ఎందుకు ఉందనేది పీసీసీ సైతం అరా తీస్తుంది.

మరోదఫా నామినేటెడ్ పదవుల పంపకాలకు అధిష్టానం సిద్ధం అవుతుంది కానీ జిల్లా నుంచి ఎవరి పేరు కూడా ఆ ప్రతిపాదనల్లో లేదని సమాచారం. స్థానికంగా కూడా మార్కెట్ కమిటీ లకు పాలక వర్గాల నియామక పక్రియ పూర్తీ అయింది. కీలక మైన నుడా కు ఛైర్మెన్ నియమించారు కానీ కానీ ఇంకా డైరెక్టర్ ల నియామకం చేపట్టలేదు.

ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలమీద అంతా ఆశలు పెట్టుకొని ఉన్నారు డీసీసీబీ. డీసీఎంయస్ జడ్పి మున్సిపల్ అధ్యక్ష పీఠాల మీద అనేక కీలక నేతలు కన్నేశారు.అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సానుకూల ఫలితాలు సాధించక పోయినప్పటికి పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలోనే ఏకంగా అయిదు కార్పొరేషన్ పదవులు కేటాయించారు.

అనిల్ ఇరవత్రి, మానాల మోహన్ రెడ్డి, బాలరాజు, తాహెర్, అన్వేష్ రెడ్డి ,కీలక కార్పొరేషన్ ల ఛైర్మెన్ లుగా నియామకం అయ్యారు వీరంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం చివరి దాక గట్టిగా ప్రయత్నాలు సాగించినవారే. ఆలా అని బిఆర్ యస్ పదేళ్ల ప్రభుత్వం పాలన మీద క్షేత్ర స్థాయిలో గట్టిగా కొట్లాడిన వారు మాత్రం కాదు జస్ట్ ఆలా సీనియర్ నేతలుగా చెలామణి అయ్యారు టికెట్ కోసం అదే అర్హత గా చెప్పుకున్న వారే .

కానీ అనేక మంది యువనేతలు బిఆర్ యస్ ప్రభుత్వ వైఫల్యాల మీద గొంతెత్తిన ఎంతో మంది ఇప్పుడు అనామకులుగా మిగిలి పోయారు. కీలక పదవులు పొందుతున్న నేతలు దిగ్గజ నేతల ప్రాపకం పొందిన వారు కావడం వల్లే అందలం దక్కింది.

కానీ పదవులు పొందిన నేతలెవ్వరూ పదేళ్ల కాలం లో జిల్లా లో ప్రజా సమస్యల మీదఏనాడూ పల్లెతు మాటకూడా మాట్లాడలేదు. ఓ మాజీ మంత్రి కి వీరవిధేయులుగా బలమైన ముద్ర వేసుకున్నవారికె అందలం దక్కింది.

స్థానికంగా అందుబాటు లో ఉన్న పదవులు కేవలం ఆయా దేవాలయాల కమిటీ లు మాత్రమే. వాటి కోసం ఎవరు ఆసక్తి చూపడం లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తమ పదవుల ఆశలనూనెరవేర్చు కోవాలని ఆరాట పడుతున్నారు.

జడ్పి డీసీసీబీ లతో మున్సిపల్ ఛైర్మెన్ లతో పాటు నిజామాబాద్ నగర మేయర్ పీఠం దక్కించుకునే ఎత్తుగడ లు ఈపాటికే కొందరు నేతలు మొదలు పెట్టారు.

రిజర్వేషన్ ఎలా ఉండబోతుందో ఓ అంచనా గా వేసుకొని ఆయా పదవులు కోసం మంత్రాంగం మొదలు పెట్టారు. ఎలాగో పార్టీ అధికారంలో వుండడం తో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం పార్టీకిఅనివార్యం .

ఫలితాలు సానుకూలంగా ఉంటాయనే ఆలోచనతో నేతలు ఆయా పదవులు పొందే మార్గాలను అన్వేషిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments