నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ ను జగద్గురు శ్రీశ్రీశ్రీ హంపి విరూపాక్ష విద్యానంద భారతి స్వాముల ఆధ్వర్యంలో మంగళవారం సన్యాసాన్ని పుచ్చుకున్నారు.
నేటి నుంచి శ్రీశ్రీశ్రీ కేదారానంద స్వాముల నామకరణం చేశారు.గత మూడు రోజులుగా కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి శ్రీరాములు మహారాజు గారి సన్యాస దీక్ష కార్యక్రమంలో భాగంగా ఉదయం గోదావరి నది స్నానమాచరించి జగద్గురు శ్రీశ్రీశ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి గారి చేతుల మీదుగా కాషాయ వస్త్రాలను స్వీకరించి సన్యాస దీక్షను తీసుకోవడం జరిగింది. ఆశ్రమంలో సాంప్రదాయ బద్ధంగా సన్యాస దీక్ష కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి గారు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ సనాతనమైన ధర్మాన్ని పరిరక్షిస్తూ శ్రీ రాములు మహారాజు గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.
ఈరోజు నుంచి కాషాయ సన్యాస దీక్షను స్వీకరించారని వారి నామధేయం ఈరోజు నుంచి.శ్రీశ్రీశ్రీ కేదారానంద స్వాముల అని పిలవడం జరుగుతుందని నామకరణం చేశారు. కేదారేశ్వర ఆశ్రమానికి విచ్చేసిన పూజ్య సాధు గురుదేవులందరికీ, హంపి స్వామి వారికి పాదపూజ నిర్వహించి.
భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల జిల్లా నుండి వచ్చిన సాధువులు. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల్లో వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు
