నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఆ ఆలయ ప్రాంగణంలో రూ 4 కోట్ల రూపాయల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది .
ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం ద్వారా ఆలయాన్ని సందర్శించే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని, స్థానిక పర్యాటక అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
