ఆర్మూర్ పట్టణంలో తిరుమల కాలనీలో భారీ దొంగతనము జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఓ ఇంటి తాళం పగలగొట్టిరూ 1 .80 లక్షల సొత్తు ఎత్తుకెళ్లారు మహేష్ అనే వ్యక్తి తన తల్లి ఆరోగ్యం బాగా లేనందున చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు…
తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో ఉన్న సొత్తు 4 తులాల బంగారంతో పాటు 1 లక్ష 80 వేల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు .
బాధితుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చిన్నయ్య వచ్చి చోరీకి పాల్పడిన ఇంటిని పరిసరాలను పరిశీలించారు.
అనంతరం క్లూస్ టీం బృంద సభ్యులు వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుడు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని డిటిడిసి కొరియర్‌లో పనిచేస్తున్నట్లు చెప్పాడు.
ఆ కొరియర్ కు సంబంధించిన ఒక లక్ష 80 వేల రూపాయలు బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. కానీ ఈలోపు ఆసుపత్రికి అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది.
