కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారు జామున తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది సుమారు రూ 20 లక్షల మేరకు సొత్తు ఎత్తుకెళ్లారు.
జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్ లో ప్రభుత్వ స్కూల్ టీచర్ లావణ్య, సురేష్ దంపతుల ఇంట్లో ఈ చోరీ జరిగింది. వరంగల్ కు వెళ్లి తిరిగి ఇంటికొచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి చెక్ చేయగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
16 తులాల బంగారం 30 తులాల మేరకు వెండి 90 వేల నగదు ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు
