పట్టపగలే …అందరూ చూస్తుండగానే ఇద్దరు యువకులు ఓ వ్యక్త్తిని వెంటాడి మరీ అదికూడా నిత్యం రద్దీ గా ఉండే మేడ్చల్ జాతీయ రహదారి కత్తి విచక్షణ రహితంగా పొడిచి హత్య చేసారు.
వాహనాల్లో వెళ్తున్నవారు సినిమా షూటింగ్ చూస్తున్నట్లుగా చూస్తూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు మరికొందరు సెల్ ఫోన్ లలో వీడియో తీశారు మీదే పోలీస్ స్టేషన్ కూత వేటు దూరం లే నే ఈ ఘాతుకం జరిగింది.
ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంకు చెందిన ఉమేష్ (25) బతుకు దెరువు కోసం ఈ మద్యే తన కుటుంబ సభ్యులతో వచ్చి మేడ్చల్లో నివాసం ఉంటున్నారు.
ఇద్దరు వ్యక్తులు ఉమేష్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు.
హత్యపై విచారణ చేస్తున్నారు హత్య చేసిన ఇద్దరు దుండగులు సంఘటన స్థలం నుండి పరారైనట్లు సమాచారం.విషయం తెల్సి కుటుంబ సభ్యులు సంఘటన స్థలం కు వచ్చి గుండెలు బాదుకున్నారు.
