కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , అగ్ర నేత రాహుల్ లతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం గురువారం జరిగింది.
సీఎం రేవంత్ తో పాటు ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షడు మహేష్ గౌడ్ లు ఈ భేటీ లో పాల్గొన్నారు తెలంగాణలో శాస్త్రీయంగా నిర్వహించిన కుల గణన సర్వేపై, అలాగే ఎన్నికల హామీల అమలుపై అగ్రనేతలకు సమగ్రమైన నివేదిక అందించారు .
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని రాహుల్ గాంధీ , ఖర్గే వివరించారు కేంద్రం ఆమోదం ఇవ్వకపోతే, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ శాసనసభలో ఓటు వేసిన విషయంలో కేంద్రం తీరుపై పార్టీకి స్పష్టత ఇచ్చారని .
9వ షెడ్యూల్‌లో చేర్పు కోసం పార్లమెంట్‌లో ఒత్తిడి కొనసాగిస్తాం.రాహుల్ సైతం హామీ ఇచ్చారు ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ ఎంపీలకు కుల గణనపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణ మోడల్‌గా దేశానికి మార్గదర్శకం అవుతోందని అగ్ర నేతలు పేర్కొన్నారు
