లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరస సాగుతున్న వలస లు గులాబీ పార్టీ లో గుబులు రేపుతున్నాయి. నేతలు పార్టీ మారకుండా నియంత్రించే నాధుడే లేకుండా పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కొట్టిన దెబ్బకు మాజీ లు ఇంకా గింగిరాలు తిరుగుతున్నారు. పదేళ్లు కనుసైరాలతో పెత్తనం సాగించిన మాజీ ఎమ్మెల్యే లు ఇప్పుడు నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాల మీద పార్టీ అధిష్టానం గంపెడు ఆశలు పెట్టుకుంది. బలమైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి ప్రకటించారు.
నిజానికి ఆపార్టీలో ఉన్న నేతల్లో బలమైన నేతగా గోవర్ధన్ ఒక్కరే ఉన్నారు.కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు.అసెంబ్లీ ఎన్నికల దాక పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు పార్టీ ని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే లు ఫలితాల తరవాత అడ్రస్ లేకుండా పోయారు. ఓటమి నెపం క్యాడర్ నెత్తిన రుద్దేసి హైదారాబాద్ కే పరిమితి అయ్యారు.దీనితో భవిష్యత్తు పరిణామాల ను దృష్టిలో పెట్టుకొని కీలక నేతలు పార్టీ వీడుతున్నారు. వద్దకు కలసి సాగుదాం అని భరోసా ఇచ్చే వారే లేకుండా పోవడంతో చాలామంది నేతలు అయిష్టంగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
బిసి మున్నారు కాపు సామాజిక వర్గం కు చెందిన బాజీ రెడ్డి గోవర్ధన్. ఎన్నికల ప్రచారక్షేత్రంలో అడుగుపెట్టారు. లోకసభ ఎన్నికల ప్రచార పక్రియ మొదలైన రోజే డీసీసీబీ తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీ బిఆర్ యస్ నుంచి కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళింది. పదవీ కాలం పూర్తీ చేసుకున్న సర్పంచ్ లు దాదాపు వంద మందికి పైగా పార్టీని వీడారు. బిఆర్ యస్ కు తిరుగులేని మెజార్టీ ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు అరడజన్ మంది కార్పొరేటర్లు బిఆర్ యస్ ని వీడి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లిపోయారు.
మాజీ మేయర్ సుజాత తో పాటు ఆయా పదవుల్లో ఉన్న 26 మంది నేతలు బిఆర్ యస్ ను వీడారు.బోధన్ నియోజకవర్గం కు చెందిన జడ్పి వైస్ చైర్మన్ సైతం ఈ మద్యే కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే కు సైతం వలస బెడద వెంటాడుతుంది. పదేళ్లు వేముల ప్రశాంత్ రెడ్డి కి వీరవిధేయుడిగా ముద్ర వేసుకున్న డీసీసీబీ ఛైర్మెన్ అందరికి కన్న ముందే తిరుగుబాటు జెండా ఎత్తారు.పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి ని అవిశ్వాసం పెట్టి చైర్మెన్ బాధ్యతలనుంచి తప్పించారు.
బిఆర్ యస్ పార్టీకి 17 మంది డైరెక్టర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. డైరెక్టర్ల ను పార్టీ మారకుండా బుజ్జగించే నాధుడే లేకుండా పోయారు.ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో దాదాపు 40 మందికి పైగా సింగిల్ విండో అధ్యక్షులు వీరితోపాటు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. మరో వైపుజిల్లా పరిషద్ లోనూ అవిశ్వాస రగడ మొదలు కాబోతుంది. బాల్కొండ నియోజకవర్గం లోని ఓ జడ్పిటిసి సభ్యుడే దీనికి తెరలేపారని ప్రచారం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ లోనూ ఇదే జరిగింది.18 మందికౌన్సిలర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరారు.
నందిపేట్ మాక్లూర్ మండలాలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు వరుసగా పెట్టి కాంగ్రెస్ లోకి వలస వెళ్తున్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి ప్రతీకార చర్యలు మొదలవ్వక ముందే పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల్లో వణుకు మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు లేని నియోజవర్గాలైన అర్బన్ ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటు బిఆర్ యస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ సెగ్మెంట్ లోనే వలసల బెడద ఎక్కువగా ఉంది. అయితే పదేళ్లు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో పెత్తనం సాగించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గాలకు మొహం చాటేశారు.
హైదారాబాద్ కే పరిమితం అయ్యారు. ఆర్మూర్ మాజీఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కూడా స్థానికంగా అందుబాటులో లేకుండా పోయారు. ఆయన రెండు రోజులహడావుడి చేసి హైదారాబాద్ జారుకున్నారు . బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఫలితాలు వచ్చిన రెండో రోజే దుబాయి వెళ్లపోయారు. పోలీసు కేసులతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన ఇప్పట్లో బోధన్ లో అడుగుపెట్టే పరిస్థితి లేదు.ఎన్నికలకు మూడు హడావుడి చేసిన ఆయన భార్య ఆయెషా కూడా క్యాడర్ కు అందుబాటులో రావడంలేదు.
మాజీ ఎమ్మెల్యే లు నియోజకవర్గాల్లో వస్తూ వెళ్తేనే పార్టీ నేతలకు భద్రతా భరోసా వుంటుంది. కానీ వారు హైదారాబాద్ కు పరిమితం కావడంతో కిందిస్థాయిలో నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.మాజీ ఎమ్మెల్యే లను కాదని నియోజకవర్గాల్లో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు.తమ సెగ్మెంట్ లలో క్యాడర్ కు అందుబాటులో ఉండాలని మాజీ ఎమ్మెల్యే లను పురమాయిస్తున్నారు. లోకసభ ఎన్నికల్లోనూ మాజీ లనే రంగంలోకి దించబోతున్నది.
