Sunday, April 26, 2026
HomeTelanganaNizamabadడివిజన్ 34లో ఎంఐఎం అభ్యర్థి తిప్రిక భాగ్యమ్మ ఉపసంహరణ..

డివిజన్ 34లో ఎంఐఎం అభ్యర్థి తిప్రిక భాగ్యమ్మ ఉపసంహరణ..

నగరంలోని 34వ డివిజన్ నుంచి అభ్యర్థి తిప్రిక భాగ్యమ్మ, తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజుద్దీన్, నగర అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఫాజిల్ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు..

అభ్యర్థి తిప్రిక భాగ్యమ్మ, జర్నలిస్ట్ తిప్రిక హరికృష్ణలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యూహాలపై చర్చించిన అనంతరం, అధిష్టానం సూచన మేరకు నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ..

తిప్రిక భాగ్యమ్మకు ఎంఐఎం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల (SC) కేటగిరీలో ఆమెకు పూర్తిస్థాయి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.

సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!