సంజీవయ్య కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు 37 డివిజన్ వివిధ కులాల పెద్దలందరు కలిసి గట్టుగా ఎటువంటి తార తమ్యం లేకుండా ఆధిపరాశక్తి శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం,పూజ, హోమం, నైవేద్యం, అన్నదానం కార్యక్రమాలను భక్తులందరితో కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేల ఉందన్నారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశీస్సులతో ఇందూర్ నగర ప్రజలందరు సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యలతో, రైతులకు సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని పిల్లజల్లా, గొడ్డు గోదా అన్నింటిని కాపాడాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముత్యాలు, కారిపేగుండజీ శ్రీనివాస్, మురళి, బొట్టు వెంకటేష్, బిజెపి మండల అధ్యక్షులు రాజు, సహదేవ్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
