అర్థరాత్రి రోడ్లపై అకారణంగా కనిపించిన వారికి పోలీసుల కౌన్సెలింగ్..నగరంలో రహదారులపై అర్థరాత్రి వరకు హల్చల్ చేస్తున్న యువతను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అందులోభాగంగా మంగళవారం అర్థరాత్రి ఆపరేషన్ చబుత్రా పేరుతో తనిఖీలు నిర్వహించారు.
యువకులు అర్థరాత్రి రోడ్లపై అకారణంగా కనిపిస్తే చర్యలు తీసుకుంటామని నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆపరేషన్ చబుత్రాలో భాగంగా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి పట్టణంలోని పలు ప్రదేశాల్లో 50 మంది కానిస్టేబుల్ టీమ్ లతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
కారణం లేకుండా రోడ్లుపై తిరుగుతున్న ఎలాంటి పత్రాలు లేని 25 వాహనాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై అనవసరంగా రోడ్లపై తిరిగే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే రోడ్లపైన,గ్రౌండ్లో తిరుగుతున్న 25 మంది యువకులను పట్టుకొని,వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసినట్లు తెలిపారు.
ఇక నుంచి ఎవరైనా రాత్రి 10:30 గంటల తర్వాత షాప్ ఓపెన్ చేసిన,అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వెహికల్స్ రోడ్డు పైన తిరిగిన అర్థరాత్రి సమయంలో ఎవరైనా వ్యక్తులు రోడ్ల పైన, గ్రౌండ్లో తిరుగుతూ అడ్డలు వేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్, లక్ష్మయ్య, మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్, నవీపేట్ ఎస్సై వినయ్ సిబ్బంది పాల్గొన్నారు.
