కత్తితో పొడుచుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని రెండవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే …
నగరంలోని హైమద్ పుర కాలనీకి చెందిన షేక్ రఫత్(40). భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఇంట్లో కత్తితో పొడుచుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
ఈ మేరకు కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
