HomeTelanganaNizamabadసమస్యలను పరిశీలిస్తున్నాం త్వరలో పరిష్కరిస్తాం -- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

సమస్యలను పరిశీలిస్తున్నాం త్వరలో పరిష్కరిస్తాం — అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

8 వ డివిజన్ లలిత నగర్, సాయిరాం నగర్, సాయి నగర్ కాలనీలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇందూర్ నగరం సమస్యల వలయంగా మారిందన్నారు.

ఇందూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లో సమస్యలను పరిశీలించడం జరుగుతుందని వాటిని త్వరలో పరిష్కరించేల అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటాం అని తెలియజేసారు.

ఎనిమిదో డివిజన్ లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ సమస్య కీలకంగా ఉందని వర్షాకాలంలో స్టామ్ వాటర్, డ్రైనేజీ కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండ తగు చర్యలు తీసుకోవాలన్నారు.

వర్షాకాలం రాకముందే బీటీ రోడ్స్, సీసీ రోడ్స్, లింక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని, డ్రైనేజీ కాలువల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కమిషనర్ కి సూచించారునగరంలో ఇప్పటికే డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ – 2 కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు.

ఎలక్ట్రిక్ స్తంబాలు, వీధి ద్విపాల కోరత ఉన్నందున అవసరం ఉన్న చోట వీలైనంత త్వరగా వాటిని ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.డివిజన్ వాసులకు ఆహ్లాదకరమైన పార్క్, ఓపెన్ జీమ్ తో కూడిన నిర్మాణం చేపట్టాలని సూచించడం జరిగింది.

వీధుల్లో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, చిన్న పిల్లలపై, వృద్ధులపై దాడులు జరుగుతున్నాయి అని స్థానికులు ఎమ్మెల్యేకి విన్నవించుకోగ ఎమ్మెల్యే స్పందించి వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ EE మురళి మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమీషనర్ జయకుమార్,AE భూమేష్, బిజెపి నాయకులు మఠం పవన్,నాగరాజు అంబాదాసు,బుస్సాపూర్ శంకర్, చంద్రశేఖర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments