అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన పలు దుకాణాల యజమానులకు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోనీ పలు దుకాణాలు అర్థరాత్రి వరకు తెరిచి ఉంచడంతో దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారిలో షేక్ గౌస్ పాషా, ఖురేషి హోటల్ యజమాని అన్సార్ హుస్సేన్ ల పై కేసు నమోదు బుదవారం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
