మాణిక్ భవన్ పాఠశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిగా ఉన్న నిజామాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో ప్రస్తుత విద్యార్థులు అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో పూర్వ విద్యార్థులను సాదరంగా ఆహ్వానించారు.
భరతనాట్యం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఎమ్మెల్యే గారు తన విద్యార్థి దశకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన విద్యార్థులతో సాన్నిహితంగా మమేకమయ్యారు.
