అధినేత కెసిఆర్ ఫై ధిక్కార స్వరం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత తదుపరి రాజకీయ అడుగుల ఫై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ వీడుతారా ? లేదంటే కెసిఆర్ ను కలసి సర్దుకుపోతారా? అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు.
పార్టీ వీడితే జిల్లాలో ఎవరెవరు ఆమె వెంట వెళ్తారనేది పార్టీవర్గాలకు ఆసక్తి గా మారింది.ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ల్లో గుబులు మొదలయ్యింది.
కవిత ఏపిసోడి నేపథ్యంలో వారు తమ నియోజకవర్గంలో ఆమె వెంట ఎవరెవరు వెళ్తారనేది అరా తీస్తున్నారు.అసలు ఈ పరిణామాల మీద మౌనంగా వుంటున్నారు కనీసం తమ సన్నిహితులతోనూ చర్చ చేయడానికి వెనుకాడుతున్నారు.
నిజానికి జిల్లా పార్టీలో ఆమె ప్రాబల్యం నామ మాత్రంగా మారింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలెవ్వరూ ఆమె కు టచ్ లో వుండడం లేదు.
అసలు కొఠారి ధాటి ఆమెను కలవడం ఎమ్మెల్యే లకు కష్టంగా ఉండే. ఇక సాధారణ నేతలకు కలిసి అవకాశం వుండదు. అందుకే ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డుతున్న ఆమె కు అండగా నిలవడానికి బలమైన నేతలెవ్వరూ ఇప్పడు ముందుకొచ్చే సిన్ లేకుండా పోయింది.
కోటరీ లతో గతంలో ఎమ్మెల్యే లే వేగ లేక పోయారు. అందుకే పార్టీ అధికారంలో ఉన్నకాలం లోనే తమ నియోజకవర్గాల్లో కవిత ప్రాబల్యం లేకుండా ఎమ్మెల్యే లు కట్టడి చేసారు. ఆమె వెంట తిరిగే వారిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఆమె కు తెలిసినా నిస్సహాయత గా ఉండి పోయారు.ఓ దశలో ఆమె తెలంగాణ భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలోనే మాజీ ల మీద నిప్పులు చెరిగారు. పార్టీ అధినేత తర్వాత అంతటి హవా నడిపిన ఆమె రాబోయోరోజుల్లో పార్టీలో మునుపటి ప్రాబల్యం ఉండక పోవచ్చనే చర్చ సాగుతుంది.
గతంలో ఎంపీ గా ప్రాతినిధ్యం వహించిన అయిదేళ్ల కాలంలోనే జిల్లా పార్టీలో పాలనా వ్యవహారాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు.అదే టైమ్ లో ఎమ్మెల్యే లతో దూరంగా పెరిగి ఆమె ఓటిమికి దారితీసింది.
ఈ అనుభవాల నేపథ్యంలో నే ఎమ్మెల్సీ గా నియామకం అయ్యాక జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.ఇంకా చెప్పాలంటే దూరంగానే వుంటూ వస్తున్నారు. అడపా దడపా వచ్చి వెళ్తున్నారు.కానీ జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో ఆమె చార్మింగ్ ఉన్న నేతగా ముద్ర వేసుకున్నారు.
యువ క్యాడర్ లో ఆమెకు బలమైన ఫాలోయింగ్ ఉంది. మరో వైపు జాగృతి వేదికలో తటస్తులే ఎక్కువగా ఉన్నారు.వారు రాబోయే రోజుల్లో కవిత వెంట మరింత క్రియాశీలకంగా పనిచేసే ఛాన్స్ ఉంది.
