HomeTelanganaNizamabadఅకాల వర్షాలతో అన్నదాత కు తీరని నష్టం ....ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

అకాల వర్షాలతో అన్నదాత కు తీరని నష్టం ….ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట ను కోల్పోయి రైతాంగం కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేసారు

ఆదివారం ఆయన మాట్లాడారు వానలకు వడ్లు నానుతున్న పట్టించుకొని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతు రైతు ప్రభుత్వం అని మాటలకు మాత్రమే చేతులలో లేదని రైతు రుణమాఫీ గాని రైతు భరోసా కానీ ఏది కూడా సక్రమంగా అమలు చేయలేదని రైతులు అని పేరుకు మాత్రమే పలకడం అని ఎక్కడా కూడా రైతులకు మేలు చేసిన అనవాళ్ళు లేవని అందాల పోటీ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అని కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు,

అందాల పోటీ పై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదు అని ఆదాయం లేదు అంటూనే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనలో అర్థం కావడం లేదని సీనియర్ మంత్రులు ఉన్న పరిపాలన చేయడం చేతకాకపోవడం శోచనీయమని ఇకనైనా ప్రభుత్వం మాటలు ఆపి చేతల్లో చూపించాలని కోరారు,

రాహుల్ గాంధీ దేశ భద్రత విషయంలో ఆర్మీ వాళ్ళని చులకనగా మాట్లాడడం తగదని రాజకీయం పార్టీల వరకే అని దేశ భద్రత విషయంలో అందరు కలిసి ఉండాలని అన్నారు

ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు,ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, నూతల శ్రీనివాస్, జస్సు అనిల్, రంగన్న తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments