భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం మన్మోహన్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ సింగ్ భౌతికాయంపై పుష్పగుచ్చం పెట్టి నివాళులు అర్పించారు.
అనంతరం ప్రధాని మోడీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.
