HomeTelanganaNizamabadగాడి తప్పిన మున్సిపల్ పాలన..పది రోజులగా డిప్యూటీ కమిషనర్ పదవి కాలి..ఇంచార్జి అధికారుల ఇష్టారాజ్యం..నిజామాబాద్ మున్సిపల్‌లో...

గాడి తప్పిన మున్సిపల్ పాలన..పది రోజులగా డిప్యూటీ కమిషనర్ పదవి కాలి..ఇంచార్జి అధికారుల ఇష్టారాజ్యం..నిజామాబాద్ మున్సిపల్‌లో పరిపాలన గాడి తప్పింది.

మున్సిపల్‌లో కీలకమైన విభాగాలకు చెందిన అధికారులు లేకపోవడంతో సేవలు అంతం తమాత్రంగానే అందుతున్నాయి. కేవలం కింది స్థాయి ఉద్యో గులు మాత్రమే విధుల్లో ఉంటున్నారు.

కీలకమైన అధికారులు అందుబా టులో లేకపోవడంతో నిత్యం బల్దియా కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చి వెళ్తుండే వారికి సేవలు అందడం గగనంగా తయారైంది. వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది.

గత పది రోజుల క్రితం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ పదవి విరమణ చేశారు. ఆయన గత కొన్ని నెలలుగా మునిపలోని కీలక రెవెన్యూ శాఖలో అన్ని తానై కీలకంగా వ్యవహరించారు.

ఈ మేరకు మార్చి 30 న ఆయన పదవి విరమణ చేశారు. అప్పటి నుంచి డిప్యూటీ కమిషనర్ పదవి కాలిగా ఉండడం గమనార్హం. మున్సిపల్‌లోని రెవెన్యూ విభాగం అస్తవ్యస్తంగా తయారైంది.

మున్సిపల్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్న ఆస్థి పన్ను, నల్లా పన్ను, ట్రైడ్‌ లైసెన్స్‌ ఫీజు, ఇతర ఫీజులను ఈ విభాగానికి చెందిన ఉద్యోగులు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఏ రోజుకు ఆ రోజు లక్ష్యాన్ని నిర్ణయించుకొని వసూలు చేస్తేనే మున్సిపల్‌కు జనరల్‌ ఫండ్‌ జమ అవుతోంది. ఆ నిధులతో అవసరమైన అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనా లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను నిర్వర్తించే వీలుంటుంది.

కీలకమైన విభాగం అస్తవ్యస్తంగా మారడం వల్ల ఇబ్బందులు చోటుచేసుకుం టున్నాయి. మున్సిప ల్‌ రెవెన్యూ అధికారిగా వ్యవహరించిన నరేందర్ ఏసీబీ కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యాడు. దీంతో కొన్ని రోజులు ఈ విభాగం ఆలనా పాలనా చూసే వారు కరువయ్యారు.

ఎట్టకేలకు ఒకరికి ఇన్‌చార్జి బాధ్యతలను ఇతరులకు ఉన్నతాధి కారులు అప్పగించారు. ఆయన కొన్ని రోజులకే ఆ పదవి నుంచి తప్పుకోగా రెవెన్యూలోని విభాగంలోని ఖదీర్ అనే అధికారికి ఇంచార్జి రెవెన్యూ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించారు.

మూడు నెలల క్రితం ఆయన ఇంచార్జి గా ఉన్న మున్సిపల్ కార్యాలయంలో ఉండడంలేదనే ఆరోపణలు వెలువెతుతున్నాయి. ఇంచార్జి రెవెన్యూ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఛాంబర్ లేకపోవడంతో వచ్చే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఆయన కేవలం ఆర్టిఏ విభాగంలోని వ్యాహారాలు మాత్రమే చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

అలాగే గత కొన్ని నెలలుగా కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి కనీసం నెంబర్లు, న్యూ అసిస్మెంట్లు, మ్యుటేషన్ లు అవ్వడం లేదనే ఆరోపణలున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments