HomeCRIMEనగరం లో రెచ్చి పోయిన గొలుసు దొంగలు …గంటలో నే రెండు చోట్ల చోరీ లు

నగరం లో రెచ్చి పోయిన గొలుసు దొంగలు …గంటలో నే రెండు చోట్ల చోరీ లు

చాల కాలం తర్వాత నగరంలో గొలుసు దొంగలు చెలరేగిపోయారు. గంట వ్యవధి లోనే రెండు చోట్ల గొలుసులు ఎత్తుకెళ్లారు. మొదట వినాయక్ నగర్ లో ఓ మహిళా ఇంటిముందు ముగ్గు వేస్తుండగా బైకు మీద వేగంగా వచ్చిన ఇద్దరు లో ఒకడు మెరుపు వేగం తో కిందికి దిగాడు స్వరూప అనే మహిళా మెడలో నుంచి గొలుసు లాగారు అయితే ఆమె కొద్దిసేపు ప్రతిఘటించింది దీనితో ఆమె గొలుసు తెగిపోయింది అప్రమత్తం అయినా స్నాచర్ లు చేతికి చిక్కిన సగం గొలుసు తోనే పారిపోయారు.

వారు ఎత్తుకెళ్లిన గొలుసు తులం మేరకు వుంటుంది మరో తులం మేరకు కింది పడిపోయింది.నాలుగో టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు సమీప ప్రాంతాల్లో గాలించారు బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే కసాబ్ గల్లి లోఆరు బయట నిలబడ్డ వృద్ధు రాలి మెడ లో రెండు తులాల గొలుసు ఎత్తుకెళ్లారు.

రెండు చోట్ల గొలుసు చోరీలు చేసింది ఓకే ముఠా గా అనుమానిస్తున్నారు వీరీ బైకు డ్రైవ్ చేస్తున్న యువకుడు హెల్మెట్ పెట్టుకొని వుంటే వెనుక ఉన్న యువకుడు టోపీ పెట్టుకొని మాస్క్ ధరించాడు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నూ రికార్డు అయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments