అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆల్ఫాజోలం కల్తీ కల్లు మాఫియాపై నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపింది.
నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ పూర్ణేశ్వర్ నేతృత్వంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం గత రెండు నెలలుగా నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ మాఫియా మూలాలను పెకిలించింది. లక్షల్లో సాగుతున్న ఈ అక్రమ దందాకు సంబంధించిన ముఖ్య సూత్రధారులను అరెస్టు చేయడమే కాక, భారీ మొత్తంలో నిషేధిత రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లోని కొన్ని కల్లు డిపోలను ఈ కల్తీకి కేంద్రాలుగా గుర్తించారు. కల్తీ కల్లు అమ్మకాల ద్వారా రోజుకు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న ఈ మాఫియా, కొంతమంది స్థానిక నాయకులు, ఉద్యోగుల సహకారంతోనే ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం.పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఈ నిషేధిత రసాయనాన్ని జిల్లాకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
గత రెండు నెలల్లో ఐదు కీలక కల్లు దుకాణాలపై దాడులు జరిపి, వాటిలో ఆల్ఫాజోలం కలిసిన కల్లును ధ్వంసం చేశారు. ఇక్కడి నుంచి కీలకమైన రికార్డులు, రసాయన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గుండారం గ్రామంలో 600 గ్రాముల ఆల్ఫా జోలంను పట్టుకొని సీజ్ చేయటం జరిగింది.
దీనిలో మాసుగోని రమేష్ గౌడ్, ఎల్లోల్ల అశోక్ ను నిజామాబాదు రూరల్ ps వారు అరెస్ట్ చేసారు. ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనకుర్థు గ్రామం 672 గ్రాముల ఆల్ఫా జోలంను పట్టుకొని ప్రవీణ్ గౌడ్, సాగర్ గౌడ్ ని మోపాల్ వారు అరెస్ట్ చేసారు. నిజామాబాదు నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాంగ్ర గ్రామంలో 155 గ్రాముల ఆల్ఫా జోలంను పట్టుకొని సీజ్ చేసి వేణు గౌడ్ మోహన్ గౌడ్ అరెస్ట్ చేసారు.
అలాగే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగస్థాన్ ఫేస్ 1 మెయిన్ రోడ్ పైన 157 గ్రాముల ఆల్ఫా జోలంను పట్టుకొని సీజ్ చేసి గౌండ్ల రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అమ్రాద్ కు చెందిన సుజిత్ గౌడ్ అరెస్ట్ చేసారు.
మొత్తం విలువ రూ 16,00,000 ఉంటుందని అంచనా.కల్తీ కల్లు తాగడం వల్ల కలిగే తక్షణ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య నష్టాల గురించి నిజామాబాదు, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో, ఏంటి నారకోటిక్స్ పైన, కాలేజీలలో అవగాహనా కార్యక్రమాలు పెట్టి, యువతకు మంచి మార్గంలో నడిచే విదంగా అవగాహాన కార్యక్రమాలు నిర్వచించారు. ఈ కల్తీ కల్లు దందాకు తెర వెనుక ఉన్న జిల్లా స్థాయి సూత్రధారులను ఇన్‌స్పెక్టర్ పూర్ణేశ్వర్ టీమ్ చాకచక్యంగా అరెస్టు చేసింది.
నిత్యం నిఘా ఉంటుంది..ఇన్‌స్పెక్టర్ పూర్ణేశ్వర్
“నిజామాబాద్ జిల్లా ప్రజల ఆరోగ్యంపై మా నిఘా నిరంతరం ఉంటుంది. మత్తుకు బానిసలైన వారిని రక్షించేందుకు, ఈ మాఫియాను పూర్తిగా నిర్మూలించేందుకు మా ఆపరేషన్ కొనసాగుతుంది. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద కల్లు అమ్మకాలు కనిపిస్తే వెంటనే మాకు సమాచారం అందించాలి,” అని ఇన్‌స్పెక్టర్ పూర్ణేశ్వర్ తెలిపారు.
