తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు సంధి బెన్సన్ రాజు ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో గురువారం జాతీయ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాజీ జాతీయ సేవాదళ్ అధ్యక్షుడు లాల్‌జీ దేశాయ్ తో పాటు, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాతీయ నాయకులను కలిసి వారు శుభాకాంక్షలు తెలిపారు.
బీవీ శ్రీనివాస్ గతంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో, సంధి బెన్సన్ రాజు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గ ఎన్నికైన జనరల్ సెక్రటరీగా క్రియాశీలక పాత్ర పోషించారు.
నాటి అనుబంధాన్ని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. పార్టీ బలోపేతానికి, సంస్థ పటిష్టతకు ఇలాంటి చురుకైన కార్యకర్తల సూచనలు, ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని జాతీయ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
